: విశాఖ జిల్లాలోని స్కూల్లో ఫుడ్ పాయిజన్... 60 మంది విద్యార్థులకు అస్వస్థత


విశాఖపట్నం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న చింతపల్లి మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది. ఈ ఘటనలో 60 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. రాత్రి భోజనం చేసిన అనంతరం వాంతులు, విరేచనాలతో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో, పాఠశాల సిబ్బంది వారిని స్థానికంగా ఉన్న కమ్యూనిటీ కేంద్రానికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.

  • Loading...

More Telugu News