: బెయిలిస్తే భానుకిరణ్ పారిపోతాడు... నాంపల్లి కోర్టుకు సీఐడీ ఫిర్యాదు
సంచలనం రేపిన మద్దెలచెరువు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భానుకిరణ్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటీషన్ పై నాంపల్లి కోర్టులో కొద్దిసేపటి క్రితం వాదనలు పూర్తయ్యాయి. దాదాపు మూడేళ్లకు పైగా జైలులో ఉన్నానన్న భానుకిరణ్ తనకు బెయిల్ ఇవ్వాలని పిటీషన్ దాఖలు చేసుకున్నాడు. అయితే బెయిలిస్తే భానుకిరణ్ పారిపోతాడని ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీఐడీ పోలీసులు కోర్టుకు ఫిర్యాదు చేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును నేటి సాయంత్రానికి వాయిదా వేసింది.