: పోలీసుల మాక్ డ్రిల్... కాల్పుల శబ్దాలతో దద్దరిల్లిన పార్లమెంట్ పరిసరాలు
ఒకవైపు అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలో ఉన్న పంజాబ్ లోని దినానగర్ పోలీస్ స్టేషన్ పై ఉగ్ర దాడి జరిగింది. అక్కడ సైన్యం, పంజాబ్ పోలీసులు చేపట్టిన ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇంతలోనే, పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలో, పార్లమెంటు పరిసరాలు ఒక్కసారిగా తుపాకీ కాల్పుల మోతతో దద్దరిల్లాయి. దీంతో, స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అయితే, మాక్ డ్రిల్ లో భాగంగానే ఈ కార్యక్రమాన్ని చేపట్టారని తెలుసుకుని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఉగ్రదాడి నేపథ్యంలో, దేశవ్యాప్తంగా ప్రముఖ నగరాలు, పట్టణాల్లో హైఅలర్ట్ ప్రకటించారు.