: ఢిల్లీలో మోదీ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం
ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన పార్లమెంటు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమావేశం జరుగుతోంది. పంజాబ్ లో పోలీస్ స్టేషన్ పై ఉగ్రవాదుల దాడి, అక్కడి పరిస్థితులపై చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్, అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. అంతకుముందు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ప్రధానిని కలసి పంజాబ్ దాడి ఘటనపై వివరించారు. మరోవైపు కేంద్ర హోంశాఖ కార్యాలయంలోనూ ఉన్నతస్థాయి సమావేశం జరుగుతోంది. హోంమంత్రి రాజ్ నాథ్ అధ్యక్షతన జరుగుతున్న పంజాబ్ దాడి ఘటనపైనే చర్చిస్తున్నారు.