: కర్ణాటక లోకాయుక్త చైర్మన్ కొడుకు అరెస్ట్... రంగారెడ్డి జిల్లాలో అదుపులోకి తీసుకున్న సిట్


కర్ణాటక లోకాయుక్తలో పెను ప్రకంపనలకు కారణమైన లోకాయుక్త చైర్మన్ కుమారుడు అశ్విన్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. తన అవినీతి కార్యకలాపాలతో లోకాయుక్తను భ్రష్టు పట్టించిన అశ్విన్ కర్ణాటక నుంచి పరారై తెలంగాణకు వచ్చేశాడు. హైదరాబాదు పరిసరాల్లోని రంగారెడ్డి జిల్లాలో తలదాచుకున్నాడు. ఇక లోకాయుక్త వ్యవహారంపై కర్ణాటక సర్కారు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం అశ్విన్ జాడను కనిపెట్టేసింది. కొద్దిసేపటి క్రితం రంగారెడ్డి జిల్లాలో అశ్విన్ ను అరెస్ట్ చేసింది.

  • Loading...

More Telugu News