: కాంగ్రెస్ నేతలందరిదీ ఓ దారైతే, పాల్వాయిది మాత్రం మరో దారి


తెలంగాణలో అత్యంత కీలకమైనదిగా భావిస్తున్న ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుపై ఒక్కో పార్టీ ఒక్కో అభిప్రాయంతో ఉంది. ఈ ప్రాజెక్టు డిజైన్ ను పూర్తిగా మార్చివేయాలంటూ టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ అంటుంటే... టీకాంగ్రెస్ నేతలు మాత్రం కేసీఆర్ నిర్ణయాన్ని ఎండగడుతున్నారు. ప్రాజెక్ట్ డిజైన్ ను ఎలా మార్చుతారని... దీనిపై పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నారు. అయితే, ఈ అంశంపై కాంగ్రెస్ సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇతర కాంగ్రెస్ నేతలను ఇబ్బంది పెట్టేలా ఉన్నాయి. ప్రస్తుత డిజైన్ ఆమోదయోగ్యం కాదని ఇప్పటికే పార్లమెంటరీ స్థాయి సంఘం తేల్చి చెప్పిందని పాల్వాయి అంటున్నారు. దీంతో, కాంగ్రెస్ నేతలు ఆత్మరక్షణలో పడే పరిస్థితి ఏర్పడింది. జాతీయ హోదా పేరుతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేయరాదని కూడా ఆయన అన్నారు. అలాగే, పోలవరం ప్రాజెక్టులో భాగంగా పట్టిసీమ లేదని కేంద్రం స్పష్టం చేసిందని, అందువల్ల ఏపీ ప్రభుత్వాన్ని పట్టిసీమపై కేసీఆర్ నిలదీయాలని సూచించారు.

  • Loading...

More Telugu News