: ‘ఉగ్ర’దాడిలో తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య... ముష్కరుల బందీలుగా పోలీసు ఫ్యామిలీస్


పంజాబ్ లోని గురుదాస్ పూర్ జిల్లా దీనా నగర్ లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. మారణాయుధాలతో గుట్టుచప్పుడు కాకుండా భారత భూభాగంలోకి చొరబడ్డ నలుగురు ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. పాకిస్థాన్ సరిహద్దుకు 10 కిలో మీటర్ల దూరంలో ఉన్న దీనా నగర్ లోకి సులువుగానే ప్రవేశించిన ఉగ్రవాదులు తమకు కనిపించిన బస్సుపై కాల్పులు జరిపి, ఆ తర్వాత పోలీస్ స్టేషన్ పై అటాక్ చేశారు. ఆ తర్వాత అక్కడికి సమీపంలో ఉన్న పోలీస్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లోకి ప్రవేశించారు. పోలీసు కుటుంబాలకు చెందిన కొందరిని ఉగ్రవాదులు బందీలుగా పట్టుకున్నట్లు సమాచారం. ఉగ్రవాదుల కాల్పుల్లో 9 మంది మృతి చెందారు. మృతుల్లో ఏడుగురు పోలీసులు ఉండగా, ఇద్దరు సాధారణ పౌరులున్నట్లు సమాచారం. దీంతో ఎన్ఎస్జీ కమాండోలను ప్రభుత్వం రంగంలోకి దించింది. కొద్దిసేపటి క్రితం పంజాబ్ సీఎం తో కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడారు. బీఎస్ఎఫ్ బలగాలను కూడా రంగంలోకి దించుతున్నట్లు రాజ్ నాథ్ ప్రకటించారు.

  • Loading...

More Telugu News