: అమర్ నాథ్ యాత్రలో చిక్కుకుపోయిన 100 మంది తెలుగు యాత్రికులు... కాపాడాలంటూ వేడుకోలు


అమర్ నాథ్ యాత్రకు బయలుదేరిన తెలుగు యాత్రికుల్లో 100 మందికి పైగా జమ్మూ కాశ్మీర్ లో చిక్కుకుపోయారు. తెలంగాణలోని ఖమ్మం జిల్లా మణుగూరు మండలం తోగ్గూడెం గ్రామానికి చెందిన టీడీపీ మండల అధ్యక్షుడు వీరంకి వెంకట్రావ్, ఆయన భార్య పద్మావతి, బావమరిది మురళిలతో కలిసి ఈ నెల 19న అమర్ నాథ్ యాత్రకు బయలుదేరారు. జమ్మూ కాశ్మీర్ లోని శ్రీనగర్ దాటి వెళుతున్న క్రమంలో బాల్ థార్ వద్ద కొండచరియలు విరిగిపడటంతో వీరి బస్సు నిలిచిపోయింది. దీంతో వీరు బాల్ థార్ లోనే చిక్కుకుపోయారు. వీరితో పాటు ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంకు చెందిన వంద మంది తెలుగు యాత్రికులు కూడా అక్కడ చిక్కుకుపోయారట. న్యాయవాదిగా పనిచేస్తున్న పద్మావతి అక్కడి నుంచి తన సొంతూరులో పనిచేస్తున్న స్థానిక విలేకరి ఒకరికి ఫోన్ ద్వారా సమాచారం చేరవేశారు. అక్కడి ప్రభుత్వ అధికారులు తమను ఏమాత్రం పట్టించుకోవడం లేదని, దీంతో తాము రెండు రోజులుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆమె పేర్కొన్నారు. ఎలాగైనా తమను కాపాడేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆమె కోరారు.

  • Loading...

More Telugu News