: కెనాల్ లోకి దూసుకెళ్లిన ‘ప్రైవేట్’ బస్సు... 20 మందికి తీవ్ర గాయాలు
ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన బస్సు ప్రమాదాలు తెలుగు రాష్ట్రాల్లో నిత్యకృత్యంలా మారాయి. పుష్కరాల కోసం వెళ్లిన భక్తులతో రాజమండ్రి నుంచి తిరుగుప్రయాణమైన నాగార్జున ట్రావెల్స్ కు చెందిన బస్సు నేటి తెల్లవారుజామున కెనాల్ లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 20 మందికి తీవ్ర గాయాలు కాగా, వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉంది. కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు మండలం పెద్దదేవళాపురం గ్రామ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రులను స్థానికులు సమీపంలోని నంద్యాల ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.