: ఇవాళ 'బాహుబలి' ప్రభాస్ తో మాట్లాడా: మోదీ ట్వీట్


'బాహుబలి'తో కెరీర్లోనే అతిపెద్ద విజయాన్నందుకున్న ప్రభాస్ ఈ సినిమా చూడండంటూ ఢిల్లీ పెద్దలను కోరుతున్నారు. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్లో స్పందించారు. ఇవాళ 'బాహుబలి' ప్రభాస్ తో మాట్లాడానని ట్వీట్ చేశారు. అంతకుముందు, నిన్న పెదనాన్న కృష్ణంరాజుతో కలిసి కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ వద్దకు వెళ్లిన ప్రభాస్ 'బాహుబలి' విశేషాలను ఆయనకు వివరించారు. నేడు ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఆయనతోనూ 'బాహుబలి' వివరాలను పంచుకున్నారు. సినిమా చూడాల్సిందిగా ఈ సందర్భంగా కోరారు. అందుకాయన బదులిస్తూ... వీలు చిక్కితే తప్పకుండా ఈ సినిమా చూస్తానని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News