: భారత్ తో సిరీస్ ఆడి రిటైరవుతా: మిస్బా


పాకిస్థాన్ టెస్టు జట్టు కెప్టెన్ మిస్బా ఉల్ హక్ (41) కెరీర్ చరమాంకంలో ఉంది. కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలు చవిచూసిన ఈ రైట్ హ్యాండ్ బ్యాట్స్ మన్ తన రిటైర్మెంట్ పై స్పందించాడు. కెరీర్ ఇంకెంతో కాలం కొనసాగదన్న విషయం తనకు తెలుసని, అయితే, ఇంకొన్ని టెస్టు మ్యాచ్ లు ఆడాలని కోరుకుంటున్నానని తెలిపాడు. భారత్ తో సిరీస్ గనుక ఓకే అయితే, ఆ సిరీస్ ఆడి అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పేస్తానని పేర్కొన్నాడు. ఆ విధంగా భారత్ తో సిరీసే తనకు చివరి సిరీస్ అవుతుందని అన్నాడు. మిస్బా ఇప్పటికే టి20, వన్డే ఫార్మాట్ల నుంచి తప్పుకున్నాడు. కెరీర్లో 58 టెస్టులాడిన మిస్బా 48.19 సగటుతో 4000 పరుగులు చేశాడు. వాటిలో 8 సెంచరీలు, 29 ఫిఫ్టీలున్నాయి. వన్డేల విషయానికొస్తే 162 మ్యాచ్ లాడి 43.40 సగటుతో 5122 పరుగులు సాధించాడు. అయితే, వన్డేల్లో ఒక్క సెంచరీ కూడా నమోదు చేయలేకపోయాడు. ఫిఫ్టీలు మాత్రం 42 ఉన్నాయి. టి20 క్రికెట్లో 39 మ్యాచ్ లాడిన ఈ వెటరన్ బ్యాట్స్ మన్ 788 పరుగులు చేశాడు. కాగా, భారత్-పాక్ సిరీస్ ఈ ఏడాది చివర్లో జరిగే అవకాశాలున్నాయి. దాయాదుల మధ్య క్రికెట్ సమరం అంటే రాజకీయ పరమైన అంశాలతో ముడిపడి ఉంటుంది. ఈ కారణంగానే, ప్రతిపాదిత భారత్-పాక్ సిరీస్ పై స్పష్టమైన ప్రకటన ఇంతవరకు రాలేదు.

  • Loading...

More Telugu News