: ఓ దోషికి మద్దతు తెలిపాడు... సల్మాన్ బెయిల్ రద్దు చేయండి: 'మహా' గవర్నర్ కు బీజేపీ వినతి పత్రం
ముంబయి వరుస పేలుళ్ల కేసులో కీలక నిందితుడు యాకూబ్ మెమన్ కు ఉరిశిక్ష అన్యాయం అంటూ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ట్విట్టర్లో ఎలుగెత్తడంపై క్రమంగా అగ్గి రాజుకుంటోంది. సల్మాన్ ట్వీట్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ ముంబయి విభాగం అధ్యక్షుడు ఆశిష్ షేలార్, ఆదివారం, గవర్నర్ విద్యాసాగర్ రావుకు వినతి పత్రం సమర్పించారు. ఓ కేసులో దోషిగా తేలిన వ్యక్తికి సల్మాన్ మద్దతివ్వడం తమను బాధించిందని షేలార్ మీడియాకు తెలిపారు. సల్మాన్ తన ట్వీట్ల ద్వారా ఓ నేరస్తుడికి మద్దతుగా మాట్లాడారని, అందుకే హిట్ అండ్ రన్ కేసులో ఆయన బెయిల్ రద్దు చేయాలని తాము గవర్నర్ ను కోరామని పేర్కొన్నారు.