: సల్మాన్ నివాసం వద్ద భద్రత పెంపు... ఘాటుగా స్పందించిన రామ్ దేవ్


ఓ అమాయకుడిని ఉరితీస్తే మానవత్వాన్ని ఉరితీసినట్టేనని ముంబయి వరుస పేలుళ్ల నిందితుడు యాకూబ్ మెమన్ విషయంలో సల్మాన్ ఖాన్ చేసిన ట్వీట్లపై సర్వత్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ముంబయిలో పలు చోట్ల సల్మాన్ తాజా చిత్రం 'బజరంగి భాయిజాన్' పోస్టర్లను దహనం చేశారు. ఈ నేపథ్యంలో, ముంబయి పోలీసులు సల్మాన్ నివాసం వద్ద భద్రత పెంచారు. కాగా, సల్మాన్ ట్వీట్లపై విఖ్యాత యోగా గురు బాబా రాందేవ్ ఘాటుగా స్పందించారు. జాతి విద్రోహులకు గుణపాఠం నేర్పడం చాలా ముఖ్యమని అన్నారు. మానవత్వం పేరిట జాతి విద్రోహులకు వంత పాడేవారిని కూడా కఠినంగా శిక్షించాలని పరోక్షంగా సల్మాన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అటు, బీజేపీ ఎంపీ కిరీట్ సోమయ్య ఈ విషయాన్ని సోమవారం నాడు పార్లమెంటులో లేవనెత్తుతానని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News