: బోనమెత్తిన 'ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ'!


ఈ ఉదయం హైదరాబాద్, మాదాపూర్ లోని ఐటీ ఉద్యోగుల అసోసియేషన్ ఆధ్వర్యంలో బోనాల పండగ వైభవంగా జరిగింది. ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్న వందలాది మంది బోనాలు నెత్తిన పెట్టుకుని రహేజా ఐటీ పార్క్ వీధుల గుండా నడచి వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత హాజరయ్యారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా బోనాల పండగను నిర్వహించుకోవాలని ఈ సందర్భంగా కవిత పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల పండగ ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు.

  • Loading...

More Telugu News