: రిషికేశ్వరి పేరిట ఫేస్ బుక్ పేజీ... మరణానికి కారణమైన అమ్మాయి ఫోటో కూడా!


నాగార్జున యూనివర్శిటీలో ర్యాగింగ్ భూతానికి బలైన రిషికేశ్వరి పేరిట ఓ ఫేస్ బుక్ పేజీ ప్రారంభం కాగా, నెటిజన్ల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. ఆమె మరణానికి కారకులు వీరేనంటూ పోలీసులు అరెస్ట్ చేసిన ఇద్దరు సీనియర్ విద్యార్థులు, ఓ విద్యార్థిని ఫోటోను కూడా ఈ పేజీలో ఉంచారు. రిషికేశ్వరికి జరిగిన అన్యాయం మరొకరికి జరగకుండా చూడాలని డిమాండ్ చేస్తూ, ఆమె మృతిపై నెలకొన్న అనుమానాలను ప్రశ్నల రూపంలో సంధించారు. ఉరేసుకున్న రిషికేశ్వరిని కిందకు దించిందెవరు? ఆమె ఉరేసుకుని చనిపోయినట్టు ఒక్క ఫోటో ఆధారం కూడా ఎందుకు లేదు? ఆమె మరణ వార్త హాస్టల్ లోని విద్యార్థినుల కంటే, బాయ్స్ హాస్టలుకు ముందే ఎలా వెళ్లింది? బాబూరావుకు సీనియర్లు ఎందుకు ఫోన్ చేశారు? సస్పెన్షన్ కు ముందే బాబూరావు రాజీనామా ఎందుకు చేశాడు? ఇలా పలు జవాబులు లేని ప్రశ్నలను అడిగారు. ఆత్మహత్యకు ముందు రోజు సినిమా హాల్లో ఏం జరిగిందని, యాంటీ ర్యాగింగ్ కమిటీని ఎందుకు ఏర్పాటు చేయలేదని కూడా ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News