: 12 రోజుల్లో రూ. 250 కోట్ల వ్యాపారం!


రోజుకు 20 లక్షల మంది చొప్పున ఓ ప్రాంతానికి వస్తే, అది కూడా ఒకరోజు రెండు రోజులు కాదు... వరుసగా 12 రోజులు. ఆ ప్రాంతంలో వ్యాపారం ఎలా సాగి ఉంటుంది? పాన్ షాపులు, బడ్డీ కొట్లు, చిన్న చిన్న బంకుల నుంచి హోటల్స్, టిఫిన్ సెంటర్లు, ట్రావెల్స్... ఇలా అన్ని రంగాల వ్యాపారులకూ పండగే. అదే జరిగింది రాజమండ్రిలో. గోదావరిలో పుష్కర స్నానం కోసం అత్యధిక సంఖ్యలో యాత్రికులు వెళ్లింది రాజమండ్రికే. ఈ 12 రోజుల వ్యవధిలో రాజమండ్రిలో మొత్తం రూ. 250 కోట్ల విలువైన వ్యాపారం జరిగివుంటుందని అంచనా. 144 ఏళ్ల తరువాత వస్తున్న మహా పుష్కరాలని, ఈ పుష్కరాల్లో పిండ ప్రదానం చేస్తే చనిపోయిన వారి ఆత్మలకు శాంతి కలుగుతుందని ప్రచారం భారీగా జరగడంతో, పురోహితులకూ బాగానే గిట్టుబాటు అయింది. రాజమండ్రిలోని పుష్కర ఘాట్లలో 55 లక్షల మంది పిండప్రదానాలు చేయగా, ఒక్క కోటి లింగాల రేవులోనే 22 లక్షల మంది పిండాలు పెట్టినట్టు అధికార లెక్కలు చెబుతున్నాయి. ఏదేమైనా, పుష్కరాలు విజయవంతం కావడంతో ఏపీ సర్కారు ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.

  • Loading...

More Telugu News