: ఇండియాను కాదనుకొని విదేశాలకు వలస వెళ్లిన 61 వేల మంది మిలియనీర్లు


గడచిన 14 సంవత్సరాల్లో ఇండియా నుంచి సుమారు 61 వేల మంది మిలియనీర్లు విదేశాలకు వెళ్లిపోయారట. పన్ను రాయితీల భారం తక్కువగా ఉండడం, భద్రత, పిల్లల విద్య తదితరాలు ఇందుకు కారణాలని న్యూ వరల్డ్ హెల్త్, లియో గ్లోబల్ విడుదల చేసిన సంయుక్త నివేదిక వెల్లడించింది. 2000 సంవత్సరం ప్రారంభం నుంచి పలు అభివృద్ధి చెందిన దేశాల్లో ద్వితీయ శ్రేణి పౌరసత్వ సౌకర్యాలు మెరుగుపడడం కూడా వలసలను ప్రోత్సహించాయని నివేదిక వ్యాఖ్యానించింది. చైనాకు చెందిన 91 వేల మంది ధనవంతులు విదేశాల్లో స్థిరపడగా, రెండో స్థానంలో ఇండియా నిలిచిందని తెలిపింది. విదేశాలకు వలస వెళ్లిన ఇండియన్లలో అత్యధికులు యూఏఈ, యూకే, యూఎస్, ఆస్ట్రేలియాల్లో స్థిరపడగా, చైనాకు చెందిన వారిలో అత్యధికులు యూఎస్, హాంకాంగ్, సింగపూర్, యూకేల్లో స్థిరపడ్డారని వివరించింది. గడచిన 14 ఏళ్లలో అత్యధికంగా బ్రిటన్ కు 1.25 లక్షల మంది వలస వచ్చారని తెలిపింది. ఫ్రాన్స్ నుంచి 42 వేల మంది, ఇటలీ నుంచి 23 వేల మంది, రష్యా నుంచి 20 వేల మంది, ఇండోనేషియా నుంచి 12 వేల మంది, సౌతాఫ్రికా నుంచి 8 వేల మంది, ఈజిప్ట్ నుంచి 7 వేల మంది వలస వెళ్లారని వివరించింది.

  • Loading...

More Telugu News