: మన పరిస్థితేంటి?: టీ-కాంగ్రెస్ నేతల చర్చ


కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లోకి నేతల వలసలు పెరిగిన నేపథ్యంలో, పార్టీ పరిస్థితిపై కాంగ్రెస్ శాసనసభా పక్షం చర్చించింది. ఈ ఉదయం అసెంబ్లీ కమిటీ హాల్లో సమావేశమైన కాంగ్రెస్ పార్టీ నేతలు తాజా రాజకీయ పరిస్థితులు, తదుపరి అసెంబ్లీ సెషన్లో టీఆర్ఎస్ పార్టీని ఇరుకునబెట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఓటుకు నోటు, రాజీనామాలు చేయకుండానే టీఆర్ఎస్ లో చేరి పదవులను అనుభవిస్తున్న వారి ఉదంతాలతో పాటు, ఎన్నికల వేళ ఇచ్చిన పలు హామీలను అమలు చేయడంలో విఫలమైన టీఆర్ఎస్ వైఖరిని ఎండగట్టాలని వారు నిర్ణయించినట్టు తెలిసింది. ఈ సమావేశంలో తెలంగాణ సీఎల్పీ నేత జానారెడ్డి, టీ-పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలూ పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News