: రూ. 30 వేల వరకూ భారం కానున్న హ్యుందాయ్ కార్లు


దేశంలోని రెండవ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్, ఆగస్టు నుంచి ధరలను పెంచాలని నిర్ణయించింది. ఉత్పత్తి వ్యయం పెరిగిన నేపథ్యంలో వివిధ మోడల్ కార్లపై రూ. 30 వేల వరకూ ధరలు పెరగనున్నాయని, లోఎండ్ మోడల్ లో కనీస పెంపు రూ. 3 వేలు ఉంటుందని సంస్థ వివరించింది. ఎస్ యూవీ మోడల్స్, ఇటీవల మార్కెట్లోకి విడుదలైన 'క్రెటా' మినహా మిగతా అన్ని రకాల మోడల్స్ ధరలూ పెరుగుతాయని స్పష్టం చేసింది. ఉత్పత్తి వ్యయం పెరగడంతో సంస్థ మార్జిన్లపై ఒత్తిడి పెరుగుతోందని, అందువల్లే ధరలను పెంచాల్సి వస్తోందని హ్యుందాయ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ విభాగం వైస్ ప్రెసిడెంట్ రాకేష్ శ్రీవాత్సవ తెలిపారు. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 7 శాతం అమ్మకాల వృద్ధిని సాధించామని హ్యుందాయ్ ప్రకటించింది.

  • Loading...

More Telugu News