: బ్రీత్ అనలైజర్ పరీక్ష నిమిత్తం జయప్రద కారును ఆపిన పోలీసులు


హైదరాబాద్, ఫిలింనగర్ రోడ్ నంబర్ 1లోని భారతీయ విద్యాభవన్ వద్ద డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించిన పోలీసులకు, అటుగా వెళ్తున్న జయప్రద కారు తారసపడింది. ఆమె కారును ఆపిన పోలీసులు డ్రైవరుకు బ్రీత్ అనలైజర్ పరీక్ష నిర్వహించారు. అంతకుముందు ఓ విందులో పాల్గొని ఆమె ఇంటికి బయలుదేరారని తెలిసింది. బ్రీత్ అనలైజర్ పరీక్షల్లో జయప్రద కారు డ్రైవర్ మద్యం తాగలేదని తేలింది. కాగా, డ్రంకెన్ డ్రైవ్ లో భాగంగా తనిఖీలు నిర్వహించగా, 14 మంది మందుబాబులు దొరికారని పోలీసులు తెలిపారు. 8 ద్విచక్రవాహనాలు, ఆరు కార్లను సీజ్ చేసి స్టేషనుకు తరలించామని, వీరికి సోమవారం నాడు కౌన్సెలింగ్ నిర్వహించి, మంగళవారం ప్రత్యేక కోర్టులో ప్రవేశపెడతామని వివరించారు.

  • Loading...

More Telugu News