: వివాహిత మహిళలతో పోలిస్తే పురుషుల ఆత్మహత్యలు రెట్టింపు
వివాహిత మహిళలతో పోలిస్తే ఆత్మహత్యలు చేసుకుంటున్న వివాహిత పురుషుల సంఖ్య రెట్టింపుగా ఉంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2014లో ఆత్మహత్యలకు పాల్పడ్డ వివాహమైన పురుషుల సంఖ్య 60 వేలు కాగా, వివాహిత మహిళల సంఖ్య 27 వేలుగా ఉంది. భార్య మరణించిన తరువాత 1,400 మంది ఆత్మహత్యలకు పాల్పడగా, భర్త చనిపోయిన తరువాత 1300 మంది మహిళలు తమ ప్రాణాలను బలవంతంగా తీసేసుకున్నారు. ఇక విడాకులు పొందిన అనంతరం మానసిక వేదనతో 550 మంది పురుషులు, 410 మంది మహిళలు మరణించారు. దేశవ్యాప్తంగా మొత్తం ఆత్మహత్యల్లో 66 శాతం వివాహితులు ఉన్నారని ఎన్సీఆర్బీ తెలిపింది.