: ఒకే బాయ్ ఫ్రెండ్ కోసం ఇద్దరు యువతుల సిగపట్లు
ఒకే బాయ్ ఫ్రెండ్ కోసం ఇద్దరు యువతులు నడివీధిలో గొడవపడ్డారు. అందరూ చూస్తుండగానే ఒకరినొకరు కొట్టుకున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే, మాధవాపురానికి చెందిన ఓ యువతి మొబైల్ స్టోర్ లో పనిచేస్తోంది. ఓ యువకుడితో ప్రేమలో పడింది. తన ప్రియుడు మరో యువతితో కలసి అదే మొబైల్ స్టోరుకు వచ్చాడు. దీంతో ఆ అమ్మాయి కోపం నషాళానికంటింది. తన బాయ్ ఫ్రెండుకు దూరంగా ఉండాలని హెచ్చరిస్తూ, ఆమెతో వాగ్వాదానికి దిగి రోడ్డుపైనే నాలుగు వాయించింది. తాను మాత్రం తక్కువా అంటూ, ఆ అమ్మాయి సైతం పిడిగుద్దులు గుద్దింది. చుట్టూ చూస్తున్నవారు వారిస్తున్నా ఇద్దరమ్మాయిలూ వినలేదు. వీరి కొట్లాటను చూస్తున్న పలువురు తమ మొబైల్ ఫోన్ కెమెరాలకు పనిపెట్టారు.