: నేడు కేజ్రీవాల్ ను కలవనున్న అన్నా హజారే


ఒకప్పటి తన శిష్యుడు, ప్రస్తుత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను సామాజిక ఉద్యమ నేత అన్నా హజారే నేడు కలవనున్నారు. రాత్రి 8 గంటలకు న్యూ మహారాష్ట్ర సదన్ లో వీరిద్దరూ కలుస్తారని సమాచారం. 'కార్గిల్ విజయ్ దివస్' కార్యక్రమంలో భాగంగా మృతిచెందిన సైనికుల భార్యలు, తల్లిదండ్రులకు జరిగే సన్మానోత్సవానికి హజారే ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. "కేజ్రీవాల్, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాలు నిన్న అన్నాజీకి ఫోన్ చేశారు. కలవాలని వారు చేసిన విజ్ఞప్తికి అన్నా అంగీకరించారు" అని ఆయన సహాయకుడు దత్తా అవారీ తెలిపారు. కాగా, భూసేకరణ బిల్లుపై అన్నా హజారే ఢిల్లీలో నిరసన తెలిపినప్పుడు వీరిద్దరూ కలసి ఒకే వేదికను పంచుకున్న తరువాత మళ్లీ కలవలేదు.

  • Loading...

More Telugu News