: అనంతపురంలో రాహుల్ ను సీక్రెట్ గా కలిసిన జగన్: తెదేపా నేత జూపూడి
రాహుల్ గాంధీ అనంతపురం పర్యటనలో భాగంగా, ఆయనను వైకాపా అధినేత వైఎస్ జగన్ కలిశాడని తెలుగుదేశం ఆరోపించింది. ఈ విషయంలో తమ వద్ద సమాచారం ఉందని తెదేపా నేత జూపూడి ప్రభాకర్ అన్నారు. ఎన్టీఆర్ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన, "రాహుల్, జగన్ కలిసింది నిజమా? కాదా?" అన్న విషయాన్ని వైకాపా నేతలు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. రాహుల్ వచ్చిన సమయంలోనే జగన్ అనంతపురం జిల్లాలో యాత్రలు చేయడం వెనకున్న మతలబు ఏంటో ఆ పార్టీ నేతలే చెప్పాలని వ్యాఖ్యానించారు. వీరిద్దరూ కలసి రహస్య మంతనాలు చేశారని ఆరోపించారు.