: హొయలొలికించిన నెల్లూరు భామలు!
అందమైన భామలు, లేతమెరుపు తీగలు... ఒకరి తరువాత ఒకరు వరుసగా వస్తుంటే, వారిని చప్పట్లతో ఆహూతులు అభినందిస్తుంటే, చూసేవారికి కనులపండగే. 'మిస్ నెల్లూరు-2015' పోటీలు ఆద్యంతం వైభవంగా జరిగాయి. నెల్లూరులో జరిగిన ఈ పోటీల్లో పలువురు యువతులు ర్యాంప్ పై హొయలొలికించారు. మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరమని, జీవహింస కూడదని, అవయవదానం చేసి మరో జీవితాన్ని పొందాలని ప్లకార్డులు ప్రదర్శించి, ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రయత్నించారు. 'జబర్దస్త్' ఫేం షేకింగ్ శేషు చేసిన కామెడీ స్కిట్స్ అందరినీ ఆకట్టుకున్నాయి.