: మందు కొట్టి... మీడియా వాళ్లనూ బాది..!
నిన్న రాత్రి హైదరాబాదులోని బంజారాహిల్స్ లో పోలీసులు చేపట్టిన డ్రంకెన్ డ్రైవ్ కేసులో ఓ యువకుడు పోలీసులకు సహకరించకుండా హల్ చల్ చేశాడు. ఘటనను చిత్రీకరిస్తున్న మీడియా వారిపై దాడి చేశాడు. ఓ కెమెరామెన్ చెంపలు వాయించాడు. మద్యం తాగి శ్వాస పరీక్షలకు ఒప్పుకోని అతను, ఐపీఎస్ అధికారి తేజ్ దీప్ కౌర్ బంధువునని చెప్పి పోలీసులనే బెదిరించాడు. ఏపీ 10 ఏజీ 0027 కారులో వచ్చిన ఆ యువకుడిని అదుపు చేసేందుకు పోలీసులు ఇబ్బంది పడాల్సి వచ్చింది. బ్రీత్ ఎనలైజర్ టెస్టుకు సహకరించని అతనిపై, పలు సెక్షన్ల కింద కేసులు పెట్టి బంజారాహిల్స్ పోలీసు స్టేషనుకు తరలించారు. విషయం తెలుసుకున్న ఆ యువకుడి తండ్రి స్టేషనుకు వచ్చి, తన కుమారుడు ఆశీష్ సింగ్ చోప్రా మానసిక వ్యాధితో బాధపడుతున్నాడని చెప్పడం కొసమెరుపు.