: కసబ్ ను ఉరితీసిన తలారే... యాకూబ్ మెమన్ కు ఉరేయనున్నాడు


26/11 దాడులకు పాల్పడిన నరహంతకుడు కసబ్ ను ఉరితీసిన తలారినే యాకూబ్ మెమెన్ ను ఉరితీసేందుకు వినియోగించనున్నారు. యాకూబ్ మెమన్ ను ఉరితీసే తాడును కూడా నాగపూర్ జైల్లోనే తయారు చేయనున్నారు. మహారాష్ట్రలో ఉరితీసేందుకు రెండు జైళ్లున్నాయి. ఒకటి పూణేలోని ఎరవాడ జైలు కాగా, రెండోది నాగ్ పూర్ జైలు. కాగా, యాకూబ్ మెమెన్ ను ఉరి తీయాలా? వద్దా? అనేది ఈ నెల 27న అత్యున్నత న్యాయస్థానం ఖరారు చేయనుంది. అయితే నాగ్ పూర్ జైలు అధికారులకు అందిన సమాచారం ప్రకారం ఈ నెల 30న యాకూబ్ మెమెన్ ను ఉరితీయనున్నారు. కాగా, 250 మంది అమాయక ప్రాణాలు తీసిన ముంబై వరుస పేలుళ్ల కేసులో యాకూబ్ మెమన్ దోషి.

  • Loading...

More Telugu News