: హైదరాబాదుకు తలమానికం ఈ భవనం... గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశా: కేసీఆర్


హైదరాబాదులో అంతర్జాతీయ స్థాయి 'కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్' నిర్మించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ ట్విన్ టవర్ల రూపకల్పనకు ప్రపంచంలో 15 ప్రముఖ కంపెనీలు తయారు చేసిన భవన నమూనాలను కేసీఆర్ పరిశీలించారు. ఇందులో ఒక మోడల్ ను కేసీఆర్ ఫైనల్ చేశారు. ఈ ప్లాన్ ప్రకారం ఒక టవర్ 16 అంతస్తులు కాగా, మరొకటి 24 అంతస్తుల్లో నిర్మించనున్నారు. రెండు టవర్ల మధ్య వంతెన ఉంటుంది. అలాగే టవర్ల పైన హెలీప్యాడ్ లను నిర్మించనున్నారు. ఈ టవర్ల టాప్ ను సోలార్ రూఫ్ గా రూపొందించనున్నారు. గ్రీన్ ఎనర్జీ కాన్సెప్ట్ తో నిర్మిస్తారు. ఈ టవర్లలో వెయ్యి మందికి సరిపడా ఆడిటోరియం నిర్మించనున్నారు. అలాగే వీడియో వాల్స్ ను ఏర్పాటు చేస్తారు. హైదరాబాదులో ఏర్పాటు చేయనున్న లక్ష సీసీ కెమేరాలను ఈ వీడియా వాల్స్ ద్వారా పర్యవేక్షిస్తారు. ఈ భవనం హైదరాబాదుకు ఐకాన్ గా మారుతుందని ఆయన తెలిపారు. ఈ భవనాన్ని బంజారాహిల్స్ లో సిటీ పోలీస్ కమిషనర్ ఇచ్చిన 8 ఎకరాల్లో నిర్మించనున్నారు. అలాగే ఈ భవన నిర్మాణ పర్యవేక్షణను డీసీపీ అనురాగ్ శర్మ, సీపీ మహేందర్ రెడ్డి పర్యవేక్షించాలని ఆయన ఆదేశించారు.

  • Loading...

More Telugu News