: రాజమండ్రికి పోటెత్తిన భక్త జనం...ఆకట్టుకున్న లేజర్, శాండ్ షో


నేటి సాయంత్రంతో పుష్కరోత్సవాలు పూర్తయ్యాయని, అయితే ఏడాది పొడుగునా పుష్కరుడి ప్రభావం ఉంటుందని పండితులు ప్రకటించారు. పుష్కర ముగింపు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముగింపు వేడుకలను రాజమండ్రిలో ఘనంగా నిర్వహించింది. అఖండ హారతికి వీలుగా నేటి సాయంత్రం 6 గంటలకే స్నాన ఘాట్ ల వద్ద స్నానాలు నిలిపేశారు. భక్తులెవరినీ స్నానాలకు అనుమతించలేదు. ముగింపు వేడుకల సందర్భంగా లేజర్ షో, శాండ్ షో నిర్వహించారు. ప్రముఖ సినీ నటుడు తనికెళ్ల భరణి వ్యాఖ్యానంతో సాగిన ఈ రెండు షోలు ఆకట్టుకున్నాయి. ముగింపు వేడుకలకు భక్తులు పోటెత్తారు. లక్షలాది భక్తులు పుష్కర ఘాట్ల వద్దకు చేరుకున్నారు. మరోపక్క తెలంగాణ ప్రభుత్వం కాశీ నుంచి తీసుకువచ్చిన పండితులతో అఖండ హారతి నిర్వహించనుంది. పుష్కరాలు ముగియడంతో తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాల వద్దకు భారీ ఎత్తున ప్రజలు చేరుకున్నారు.

  • Loading...

More Telugu News