: క్రికెట్టే నా జీవితం... మళ్లీ భారత జట్టులోకి వస్తా: శ్రీశాంత్


ఐపీఎల్-6లో స్పాట్ ఫిక్సింగ్ కు సంబంధించి 16 మందిపై నమోదైన అభియోగాలను ఢిల్లీ కోర్టు కొట్టివేసింది. కోర్టు తీర్పుపై క్రికెటర్ శ్రీశాంత్ సంతోషాన్ని వ్యక్తం చేశాడు. కోర్టులపై తనకు నమ్మకం, గౌరవం ఉన్నాయని చెప్పాడు. క్రికెట్టే తన జీవితం అని... త్వరలోనే ఫిట్ నెస్ నిరూపించుకుని, జట్టులోకి తిరిగి వస్తానని శ్రీశాంత్ ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు. కష్ట కాలంలో తనకు మద్దతుగా నిలిచిన కేరళ ప్రజలు, ప్రభుత్వం, అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు.

  • Loading...

More Telugu News