: అసమానతలపై మండిపడిన రాధికా ఆప్టే
ముక్కుసూటిగా మాట్లాడడం కొందరి నైజం. మరాఠా నటి రాధికా ఆప్టే కూడా ఈ కోవలోకి వస్తుంది. ఏ విషయం గురించైనా సరే నిర్మొహమాటంగా మాట్లాడేస్తుంది. తాజాగా, వేతనాల్లో స్త్రీ, పురుష అసమానతలపై మండిపడింది. చేసేది ఒకే పనైనప్పుడు వేతనాల్లో అసమానత ఎందుకంటూ ప్రశ్నిస్తోంది. "తాజాగా 'క్వీన్', 'పీకూ', 'తను వెడ్స్ మను' సినిమాలు బాక్సాఫీస్ వద్ద వంద కోట్లు వసూలు చేసిన సంగతి తెలిసిందే. మహిళలు ప్రధాన పాత్రధారులుగా నటించిన సినిమాలు కూడా వంద కోట్ల క్లబ్ లో చేరుతున్నప్పుడు, వారికిచ్చే వేతనాలు మాత్రం పురుషులతో ఎందుకు సమానంగా ఉండకూడదని ప్రశ్నించింది. హీరోలతో సమానమైన రెమ్యూనరేషన్ హీరోయిన్లకు కూడా ఇవ్వాలని డిమాండ్ చేసింది. కేవలం సినిమాల్లోనే ఇలా జరగడం లేదని, చాలా రంగాల్లో ఈ అసమానతలు ఉన్నాయని, అలా ఎందుకు చేస్తారో తనకు తెలియదని రాధికా ఆప్టే తెలిపింది.