: ఏపీ మంత్రివర్గంతో పారిశుద్ధ్య కార్మికుల చర్చలు సఫలం... కనీస వేతనం రూ.11వేలకు పెంచేందుకు అంగీకారం


ఏపీలో 16 రోజులుగా కొనసాగుతున్న పారిశుద్ధ్య కార్మికుల సమ్మెకు తెరపడింది. ఈ రోజు రాజమండ్రిలో కార్మికసంఘం నేతలతో మంత్రివర్గ ఉపసంఘం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. మంత్రులు నారాయణ, యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు జరిపిన చర్చల్లో, కనీస వేతనం రూ.11 వేలకు పెంచేందుకు ఏపీ ప్రభుత్వం అంగీకరించింది. ఈ క్రమంలో ఒక్కొక్కరికీ రూ.2,700 వేతనం పెరగనుంది. అంతేగాక సమ్మె కాలాన్ని కూడా సెలవు దినాల్లో పనిచేసేందుకు కార్మికులు అంగీకరించడంతో ఒప్పందం కుదిరింది. దాంతో రేపటి నుంచి మున్సిపల్ కార్మికులు విధుల్లో చేరనున్నారు.

  • Loading...

More Telugu News