: కోర్టు హాలులో ఏడ్చేసిన శ్రీశాంత్, తివారీ, చండీలా


స్పాట్ ఫిక్సింగ్ లో నిర్దోషులుగా ఢిల్లీ కోర్టు పేర్కోగానే, అప్పటివరకు తీర్పుకోసం ఎదురు చూస్తున్న క్రికెటర్లంతా ఉద్వేగానికి గురయ్యారు. శ్రీశాంత్, అంకిత్ చవాన్, అజిత్ చండీలా కన్నీరు పెట్టుకున్నారు. ఎన్నాళ్లగానో ఎదురు చూస్తున్న రోజు రానేవచ్చిందంటూ హర్షం వ్యక్తం చేశారు. కళంకిత ముద్ర పోగొట్టుకున్న ఆనందం వారి కళ్లలో కనపడింది. ఆరోపణలతో అరెస్టైన రోజే శ్రీశాంత్ మాట్లాడుతూ, తాను నిర్దోషినని, కేసులోంచి కడిగిన ముత్యంలా తిరిగి వస్తానని పేర్కొన్న సంగతి తెలిసిందే. న్యాయస్థానం తాజా నిర్ణయంతో కెరీర్ పై వీరిలో మరోసారి ఆశలు చిగురించాయి.

  • Loading...

More Telugu News