: ప్రత్యేక హోదాపై ఆగస్టు 10లోగా నిర్ణయం తీసుకోండి... లేకుంటే ఆ మర్నాడే బంద్ చేస్తాం: కేంద్రానికి సీపీఐ హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధనకు ఉద్యమించేందుకు అఖిల పక్ష నేతలు మరోమారు సిద్ధమవుతున్నారు. ఈ అంశం ప్రధానంగా విజయవాడలో ఈ రోజు ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు వామపక్ష నేతలు, ఏపీ మేధావుల సంఘం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ, ఆగస్టు 10లోగా రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆ మరుసటి రోజునే 11న ఏపీ బంద్ చేపడతామని హెచ్చరించారు.