: రాజకీయాల్లో ఉన్నది చాలు, ఇక వైదొలగుతా: సింగపూర్ ఎన్ఆర్ఐ ఎంపీ
ఎనభై ఏళ్లు పైబడినా కూడా మన దేశంలో నేతాశ్రీలు రాజకీయాలకు స్వస్తి చెప్పడం ఊహకు కూడా అందదు. అందుకు భిన్నంగా సింగపూర్ లో ఎన్ఆర్ఐ ఎంపీ 55 ఏళ్ల వయసుకే రాజకీయాల నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించారు. పంజాబ్ కు చెందిన ఇంద్రజిత్ సింగ్ (55) బ్రతుకుదెరువు కోసం సింగపూర్ వెళ్లారు. అక్కడే స్థిరపడిపోయారు. మంచి వాగ్ధాటి కలిగిన ఆయన అక్కడివారికి చేరువై 1997 నుంచి ఎంపీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే ఇప్పుడు రాజకీయాల నుంచి వైదొలగుతున్నానని, త్వరలో జరగనున్న ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఆయన ఫేస్ బుక్ ద్వారా తెలిపారు. ఆయన వ్యాపారవేత్తగా కూడా రాణించడం విశేషం.