: ఏపీలో ఆగస్టు 10 నుంచి 'మీ ఇంటికి - మీ భూమి' కార్యక్రమం


ఆగస్టు 10 నుంచి 31వ తేదీ వరకు 'మీ ఇంటికి - మీ భూమి' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఏపీ డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి తెలిపారు. ఈ 20 రోజుల పాటు గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహిస్తామని చెప్పారు. గ్రామసభల్లో భూ సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తామని తెలిపారు. అదే విధంగా ఆన్ లైన్ లో రెవెన్యూ రికార్డుల్లోని లోటుపాట్లను కూడా సవరించే అవకాశం ఉందని చెప్పారు. ఎంతో ఉపయోగకరమైన ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

  • Loading...

More Telugu News