: జమ్మూ కాశ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లాలో ఉగ్రవాదుల దాడి
జమ్మూ కాశ్మీర్ లో ఈరోజు కూడా ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. ఇక్కడి అనంత్ నాగ్ జిల్లాలోని బస్టాండు సమీపంలో గ్రనేడ్ విసిరారు. ఈ ఘటనలో ఒకరు చనిపోగా, ఐదుగురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. గాయపడిన వారిలో సీఆర్పీఎఫ్ జవాను, స్థానిక పౌరులు ఉన్నట్టు గుర్తించారు. గత రెండు రోజుల నుంచి కూడా జమ్ము కాశ్మీర్ లోని మొబైల్ షాపులపై ఉగ్రవాదులు దాడి జరిపారు. అయితే వరుస ఘటనలతో ప్రజలను భయభ్రాంతులను చేసేందుకు ప్రయత్నిస్తూ ఉగ్రవాదులు తమ ఉనికిని చాటుకుంటున్నారని పోలీస్ అధికారులు అంటున్నారు.