: ఢిల్లీలో రాజ్ నాథ్ ను కలసిన ప్రభాస్
సినీ నటుడు ప్రభాస్ తన పెదనాన్న, బీజేపీ నేత కృష్ణంరాజుతో కలసి ఈరోజు ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిశారు. ఈ సందర్భంగా 'బాహుబలి' చిత్రాన్ని వీక్షించాలని వారు రాజ్ నాథ్ ను కోరారు. ఈ విషయాన్ని రాజ్ నాథ్ తన ట్విట్టర్ లో తెలిపారు. "ప్రముఖ సినీ నటుడు ప్రభాస్, శ్రీ కృష్ణంరాజును ఈ రోజు కలిశాను. ప్రభాస్ తాజా చిత్రం 'బాహుబలి' చూసేందుకు ఎదురుచూస్తున్నాను" అని రాజ్ నాథ్ ట్వీట్ చేశారు.