: ఎక్కడేం జరిగినా స్పందించేది ఒక్కడే... ఆ ఒక్కడు నేనే!: ‘అనంత’లో వైఎస్ జగన్
రైతు భరోసా యాత్ర పేరిట అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం ఆసక్తికర వ్యాఖ్య చేశారు. రాష్ట్రంలో ఎక్కడ ఏ ఘటన జరిగినా స్పందించే ఒకే ఒక్క వ్యక్తిని తానేనని ఆయన పేర్కొన్నారు. ‘‘రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా స్పందించేది ఒక్క జగనేనన్న విషయం ప్రజలందరికీ తెలుసు’’ అని ఆయన అన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకోలేదని, సుఖశాంతులతో ఉన్నారని ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు చెప్పడం సిగ్గుచేటని జగన్ నిప్పులు చెరిగారు.