: ప్రత్యేక హైకోర్టు కోసం ఉద్యమించండి... తెలంగాణ వాదులకు కోదండరాం పిలుపు


తెలంగాణ వాదులు మరో ఉద్యమానికి సిద్ధం కావాలని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో హైకోర్టు విభజన ఇంకా పూర్తి కాలేదని, ప్రత్యేక హైకోర్టు కోసం మరో ఉద్యమం చేయాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. ప్రత్యేక హైకోర్టు ఆవశ్యకతపై హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటైన రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన కోదండరాం ఉద్రేకపూరిత ప్రసంగం చేశారు. ప్రత్యేక హైకోర్టు డిమాండ్ ఒక్క న్యాయవాదులకు మాత్రమే పరిమితం కారాదని చెప్పిన ఆయన, దీని కోసం తెలంగాణ సమాజం ఉద్యమ బాట పట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో ప్రభుత్వ రంగ సంస్థల విభజనకు సంబంధించి ఎలాంటి కమిటీ ప్రస్తావన లేదని ఆయన ఆరోపించారు. షీలా బేడీ కమిటీ కూడా ఇరు రాష్ట్రాల మధ్య కేవలం ఆస్తుల పంపిణీకి పరిమితమని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News