: మరో కార్గిల్ తరహా యుద్ధాన్ని భారత సైన్యం రానివ్వదు: ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్ సుహాగ్
భారత రక్షణ బలగాలు సర్వ సన్నద్ధంగా ఉన్నాయని... మరో కార్గిల్ తరహా యుద్ధాన్ని రానివ్వమని భారత ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్ సుహాగ్ అన్నారు. కార్గిల్ యుద్ధంలో జయకేతనం ఎగురవేసి 16 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 'విజయ్ దివస్' పేరుతో కార్యక్రమాలు జరుగుతున్నాయి. జులై 20న ఈ కార్యక్రమాలు ప్రారంభం కాగా... ఈరోజు, రేపు ప్రధాన కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా దల్బీర్ సింగ్ మాట్లాడుతూ, "మరో కార్గిల్ ను మన సైన్యం అనుమతించదు" అని స్పష్టం చేశారు. 1999 మే నెలలో కార్గిల్ యుద్ధం ప్రారంభమైంది. రెండు నెలలకు పైగా కొనసాగిన ఈ యుద్ధంలో పాకిస్థాన్ ఓటమిపాలవగా... ఇండియన్ ఆర్మీ 490 మంది అధికారులను, జవాన్లను కోల్పోయింది.