: కేసీఆర్ తలచుకుంటేనే ఎవరికైనా పదవులు వస్తాయి: మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య
ముఖ్యమంత్రి కేసీఆర్ తలచుకుంటేనే తెలంగాణలో ఎవరికైనా పదవులు వస్తాయని మాజీ డిప్యూటీ సీఎం, టీఆర్ఎస్ నేత రాజయ్య అన్నారు. అంతేగానీ టీఆర్ఎస్ పార్టీలో డిమాండ్లు చేస్తే పదవులు రావని వ్యాఖ్యానించారు. ఈ మేరకు హైదరాబాద్ లో మీడియాతో ఆయన మాట్లాడారు. వ్యక్తిగతంగా తాను మున్సిపల్, పంచాయతీ కార్మికుల సమ్మెకు మద్దతు తెలుపుతున్నానన్నారు. త్వరలోనే కార్మికుల సమస్యలను సీఎం పరిష్కరిస్తారని భావిస్తున్నట్టు రాజయ్య పేర్కొన్నారు. ఉపముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించిన తరువాత కొంతకాలంగా మౌనంగా ఉంటున్న రాజయ్య తాజాగా మీడియాతో ముందుకురావడం గమనార్హం.