: జెమినీ ఫిలిం సర్క్యూట్ పై హైదరాబాద్ లో చీటింగ్ కేసు


ప్రముఖ సినిమా నిర్మాణ సంస్థ జెమినీ ఫిలిం సర్క్యూట్ పై హైదరాబాద్ లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదైంది. తమిళంలో 'మదగజ రాజ' అనే సినిమా నిర్మించేందుకు బంజారాహిల్స్ రోడ్ నెం.2లోని సాగర్ సొసైటీలో ఉన్న వెంకటేశ్వర ఫైనాన్షియర్స్ హైదరాబాద్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుంచి జెమినీ సంస్థ గతంలో రూ.7.5 కోట్లు అప్పుగా తీసుకుంది. దాన్ని వాయిదాల పధ్ధతిలో చెల్లిస్తామని ఒప్పందం కూడా చేసుకుంది. అయితే తీసుకున్న రుణం చెల్లించకపోవడం, సినిమా హక్కులను తమకు తెలియకుండా విజయ్ టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు అమ్మి తమను మోసం చేశారని, ఈ నేపథ్యంలో జెమినీ ఫిలిం సర్క్యూట్ సంస్థ మేనేజింగ్ పార్ట్ నర్ మనోహర్ ప్రసాద్ పై చర్యలు తీసుకోవాలని సదరు ఫైనాన్షియర్స్ జీఎం ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే ఆయనపై కేసు నమోదైంది.

  • Loading...

More Telugu News