: అభివృద్ధి కార్యక్రమాల్లో రాజకీయ ప్రస్తావన సరికాదు... బీహార్ లో నరేంద్ర మోదీ వ్యాఖ్య
అభివృద్ధి కార్యక్రమాల్లో రాజకీయాల ప్రస్తావన సరికాదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బీహార్ రాజధాని పాట్నాలో కొత్తగా ఏర్పాటు చేసిన ఐఐటీ ప్రారంభోత్సవానికి వచ్చిన మోదీ, పలు కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. అన్ని సమస్యలకు పరిష్కారం అభివృద్ధి మాత్రమేనని ఆయన చెప్పారు. దేశ రాజధానిలో కూర్చుని పథకాలకు రూపకల్పన చేయడం సరికాదన్న ఆయన, రాష్ట్రాల్లోని ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని పథకాలను రూపొందిస్తున్నామని మోదీ చెప్పారు.