: రాజకీయ ఉనికి కోసమే విపక్షాల రాద్ధాంతం: మంత్రి తుమ్మల


విపక్షాలపై తెలంగాణ ఆర్ అండ్ బీ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మండిపడ్డారు. కేవలం రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికే తాగునీటి ప్రాజెక్టులపై విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగానే టీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత పారదర్శకతతో ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపడుతోందని అన్నారు. పాలమూరు-రంగారెడ్డి, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులు పూర్తైతే రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని చెప్పారు.

  • Loading...

More Telugu News