: జార్ఖండ్ లో 30 వాహనాలను తగలబెట్టిన మావోలు
ఎప్పుడూ పేలుళ్లు, కాల్పులకు తెగబడే మావోయిస్టులు తాజాగా జార్ఖండ్ లో మరోవిధంగా రెచ్చిపోయారు. ఇక్కడి బొకారో జిల్లాలోని బర్నో ప్రాంతంలోని సీసీఎల్ ప్రాజెక్టు వద్ద నిలిపి ఉన్న 30 వాహనాలను తగలబెట్టారు. ఈ విషయాన్ని స్థానిక అధికారులు తెలిపారు. రాంచీకి 130 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాజెక్టు వద్దకు నిన్న(శుక్రవారం) రాత్రి వందమంది మావోయిస్టులు వచ్చారని, ఆ తరువాత వాహనాలు తగలబెట్టారని అధికారులు వివరించారు. అక్కడి నుంచి తమను వెళ్లిపోవాలని కూడా ఆదేశించారన్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రస్తుతం వారికోసం గాలింపు చేపట్టారు.