: మాదాపూర్ లో వ్యభిచార గృహాలపై దాడి... విదేశీ మహిళతో పాటు పలువురి అరెస్ట్


హైదరాబాదులో ఐటీ సంస్థలకు కేంద్రబిందువైన మాదాపూర్ లో వ్యభిచారం భారీ ఎత్తున జరుగుతోంది. పోలీసులు అడపాదడపా దాడులు చేస్తూ పలువుర్ని అదుపులోకి తీసుకుంటున్నా, ఈ చీకటి భాగోతం మాత్రం ఆగడం లేదు. ఈ క్రమంలో, మాదాపూర్ పత్రికా నగర్ లో వ్యభిచారం జరుగుతోందన్న పక్కా సమాచారం పోలీసులకు అందింది. దీంతో, ఏమాత్రం ఆలస్యం చేయని పోలీసులు వెంటనే వ్యభిచారం జరుగుతున్న అపార్ట్ మెంట్ పై దాడి చేశారు. ఈ సందర్భంగా, ఇద్దరు వ్యభిచారులు, నలుగురు విటులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిలో ఓ విదేశీ మహిళ కూడా ఉండటం విశేషం.

  • Loading...

More Telugu News