: రిషికేశ్వరి మరణ వాంగ్మూలం గుండెను పిండేసింది... ఏపీ మంత్రి గంటా ఆవేదన
గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో బీటెక్ విద్యార్థిని రిషికేశ్వరి ఆత్మహత్య ఆమె తల్లిదండ్రులు, తోటి విద్యార్థులనే కాక ఏపీ ప్రభుత్వాన్ని కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. నేటి ఉదయం ఈ ఘటనపై మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. రిషికేశ్వరి మరణ వాంగ్మూలం తన గుండెను పిండేసిందని ఆయన వ్యాఖ్యానించారు. ఆమె ఆత్మహత్యకు కారకులైన ఏ ఒక్కరిని వదిలిపెట్టేది లేదని ఆయన ప్రకటించారు. ఈ జాబితాలో కళాశాల ప్రిన్సిపాల్ బాబూరావు పేరు ఉంటే తక్షణమే ఆయనను అరెస్ట్ చేసేందుకు కూడా వెనుకాడబోమని మంత్రి వెల్లడించారు.