: పాక్ లో భూకంపం... ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టిన జనం
పొరుగు దేశం పాకిస్థాన్ లో నేటి తెల్లవారుజామున భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.1గా నమోదైంది. భూకంపం కారణంగా పాక్ రాజధాని ఇస్లామాబాదుతో పాటు ఆ దేశ ప్రధాన నగరాలు రావల్పిండి, పెషావర్, అబోటాబాదుల్లో భూమి కంపించింది. భూకంప తాకిడికి బెంబేలెత్తిపోయిన పాక్ ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. ఇస్లామాబాదుకు ఈశాన్యంగా 15 కిలో మీటర్ల దూరంలో 26 కిలో మీటర్ల లోతున భూకంక కేంద్రం ఉన్నట్లు అమెరికా జియలాజికల్ సర్వే వెల్లడించింది. ఈ భూకంపం కారణంగా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదని పాక్ మీడియా పేర్కొంది.