: ఏపీలో వేడుకగా గోదావరి పుష్కరాల ముగింపు... హాజరు కానున్న బాబా రాందేవ్


గోదావరి మహా పుష్కరాలు నేటి సాయంత్రంతో ముగియనున్నాయి. ముగింపు వేడుకలకు రెండు తెలుగు రాష్ట్రాలు భారీ ఏర్పాట్లు చేశాయి. ప్రత్యేకించి ఏపీలో గోదావరి పుష్కరాల ముగింపు వేడుకను అంగరంగవైభవంగా నిర్వహించాలని సీఎం నారా చంద్రబాబునాయుడు నిర్ణయించారు. ఈ మేరకు ఆయన అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రాజమండ్రిలో జరగనున్న ముగింపు వేడుకల్లో భాగంగా నగరంలోని ఆర్ట్స్ కళాశాలలో వెయ్యి మంది కళాకారులతో నిర్వహించనున్న కూచిపూడి నృత్యరూపకం భక్తులను అలరించనుంది. అంతేకాక ప్రముఖ సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణతో గాత్ర కచేరీని అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఇక పుష్కరాల ముగింపు సందర్భంగా రాజమండ్రిలో గోదావరికి అఖండ హారతి కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముగింపు వేడుకలకు రావాలన్న చంద్రబాబు ఆహ్వానాన్ని మన్నించిన ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ రాజమండ్రి రానున్నారు. ఇక పుష్కరాల ముగింపు ఉత్సవాలను పురస్కరించుకుని ప్రతి ఇంటిలో దీపారాధన చేయాలని చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News